పెళ్లయిన నెలకే నాలుగో నెల.. షాక్ అయిన భర్త..!

పెళ్లయిన నెలరోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో భర్త షాక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మహారాజ్ గంజ్ కి చెందిన మహిళకు నెలరోజుల క్రితం ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. పెళ్లయ్యాక అంతా బాగానే ఉంది. కానీ నెల రోజుల తర్వాత ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. 

ఆ నొప్పికి ఆమె భరించలేకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమె వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను సోనోగ్రఫీ పరీక్ష నిర్వహించగా.. ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో భర్తతోపాటు అత్త, మామలు షాక్ అయ్యారు. తాము మోసపోయామని.. భర్త కుటుంబసభ్యులు.. ఆ మహిళను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు.

ఆ భర్త అంతటితో ఆగలేదు. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా అవ్వలేదని, తాను ఘోరంగా మోసపాయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మహిళ, ఆమె కుటుంబసభ్యులు తనని మోసం చేశారని చెప్పాడు. గర్భం గురించి చెప్పకుండా తనకు పెళ్లి చేశారని అన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.

 

 

Leave a Comment