భారత్ లోనూ ఎంట్రి ఇచ్చిన కొత్త రకం కరోనా!

ప్రస్తుతం కొత్త రకం కరోనా వైరస్ తో ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ కొత్త రకం కరోనా బ్రిటన్ లో బయటపడింది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై చాలా దేశాలు నిషేధించాయి. భారత్ కూడా ఇప్పటికే యూకే నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.  

ఇప్పటి వరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ అడుగుపెట్టింది. తాజాగా భారత్ లో కూడా ఈ వైరస్ వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులలో 8 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన వారిలో ‘వీయూఐ 202021/1’ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే పూర్తిస్థాయి నివేదికలు వెల్లడయ్యే వరకు కొత్త కరోనా వైరస్ ను నిర్ధారించలేమని వైద్యలు పేర్కొన్నారు.  

 

Leave a Comment