ఈ ఏడాది కొత్త పథకాలు కట్..

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా ఖర్చులు తగ్గించే పనిలో కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ఉండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొత్త పథకాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాకకు ఎలాంటి అభ్యర్థనను పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు సూచించారు. 

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీతో పాటు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ అమలుకే ఖర్చును పరిమితం చేస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర పథకాలకు ఆమోదం లభించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వ ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్ నెలకొన్న క్రమంలో మారుతున్న ప్రాధాన్యాతలకు అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోట్ తెలిపింది. బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదించబడిన పథకాలు కూడా మార్చి 31 వరకు నిలిపివేయబడతాయన్నారు. ఈ కొత్త నిబంధనలకు మినహాయింపు ఖర్చుల శాఖ ఆమోదించాల్సిన అవసరం ఉందని నోట్ పేర్కొంది.

Leave a Comment