జులై 1 నుంచి కొత్త లేబర్ కోడ్.. చేతికొచ్చే వేతనం తగ్గిపోతుంది..!

పాత కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల జీవితాలు మెరుగు పర్చడమే ఈ కొత్త లేబర్ కోడ్ లక్ష్యమని కేంద్రం చెబుతోంది. ఈ లేబర్ కోడ్ తో ముఖ్యంగా ఉద్యోగుల జీతాలపై ప్రభావం పడనుంది. 

కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే వచ్చే మార్పులు ఇవే..

  • ముఖ్యంగా ఉద్యోగుల పని వేళల్లో మార్పులు జరగొచ్చు. ప్రస్తుతం దేశంలో వర్కింగ్ అవర్స్ 8 గంటలు ఉన్నాయి. దానిని కంపెనీలు 12 గంటలకు పెంచుకోవచ్చు. ఇలా పెంచుకుంటే.. ఉద్యోగులకు వారంలో 3 రోజులు సెలవులు ఇవ్వాలి. అంటే వారంలో నాలుగు రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారినికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.   
  • కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తే సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. అలాగే కొత్త ఉద్యోగంలో చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత సెలవులు పొందవచ్చు. ప్రస్తుతం 240 రోజులు దాటాకే సెలవులు వస్తున్నాయి. 
  • కొత్త లేబర్ కోడ్ ప్రకారం మొత్తం వేతనంలో బేసిక్ శాలరీ సగం ఉండాలి. అంటే అలవెన్సులు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక పెరిగినప్పుడు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. దీని వల్ల ఉద్యోగికి చేతికొచ్చే వేతనం తగ్గిపోతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో పాటు, గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారి జీతంలో ఎక్కువ శాతం అలవెన్సులే ఉంటాయి. కొత్త చట్టాలు అమలైతే చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. 

 

 

 

 

Leave a Comment