కొత్త లేబర్ కోడ్..ఇక వారంలో నాలుగు రోజులే పని..!

కార్మికుల కోసం నాలుగు కొత్త లేబర్ కోడ్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ కొత్త కోడ్ ప్రకారం కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారానికి 48 పని గంటలు ఉండనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు. 

ఈ కొత్త లేబర్ కోడ్ వల్ల కార్మికుల పనిలో నాణ్యత పెరుగుతుందన్నారు. కాగా రోజులు 12 గంటల పనితో పాటుచ మూడు రోజులు వేతనంలో కూడిన సెలవుల అంశాన్ని కార్మిక సంఘాల వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, దానిని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. కంపెనీలలో సాధారణంగా వారినికి గరిష్టంగా 48 గంటల పనివేళలు ఉంటాయి. రోజుకు 8 గంటలు పనిచేస్తే, వారానికి 6 పని రోజులుగా ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులతో రోజుకు 12 గంటల పనిని చేయించుకుంటే, వారానికి నాలుగు పనిదినాలు, మిగతా మూడు రోజులు సెలవు రోజులుగా ఉంటాయి.

 

Leave a Comment