ట్విట్టర్ కి ప్రత్యామ్నాయంగా కొత్త భారతీయ యాప్..!

ట్విట్టర్ గురించి తెలియని వారుండరు. గొప్ప వారందరికీ సోషల్ మీడియా వేదిక ఇదే మరి. కానీ ఇది ఒక విదేశీ యాప్. ప్రపంచంలోని ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు మరియు సేవలపై అధిక దృష్టి పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి భారతీయ యాప్ లు అధికంగా ఉద్భవించాయి. మరి ముఖ్యంగా చైనా యొక్క యాప్ లను నిషేధించినప్పటి నుంచి అధిక సంఖ్యలో వాటికి ప్రత్యామ్మాయాలు విడుదల అయ్యాయి. 

అటువంటి యాప్ లలో ‘కూ’ యాప్ ఒకటి. ఇది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యొక్క భారతీయ వెర్షన్ గా విడుదల అయింది. కూ యాప్ ను మార్చి నెలలో అప్రమేయ రాధాక్రిష్ణ, మయాంక్ బిదావత్కా అనే వారు రూపొందించారు. ఇది ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లే వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఒక వేదికగా ఉంది. ఈ యప్ హిందీ, కన్నడ భాషలలో మొదట ప్రారంభించారు. తరువాత తెలుగు, బెంగాలి, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా మరియు అస్సామీ వంటి వివిధ భాషలలో లభిస్తుంది.

ఇది వినియోగదారులు తాము ఇష్టపడే భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ వినియోగదారులను ఫాలో అవ్వడానికి మరియు ఆడియో, వీడియో, టెక్ట్స్ మరియు ఫొటోలను వివిధ ఆకృతిలో పోస్ట్ లను షేర్ చేయడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు ఇతర వ్యక్తులతో చాట్ చేయవచ్చు. మరియు పోల్స్ కూడా నిర్వహించవచ్చు. ఇది కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. 

కూ యాప్ అనేక మంది ప్రముఖులు, న్యూస్ ఛానెల్స్, జర్నలిస్టులను అనుసరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేంద్ర ఐటీ, లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Leave a Comment