రెండు గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ..!

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ హవా నడుస్తోంది. మార్కెట్ లో రోజుకో కొత్త క్రిప్టో కాయిన పుట్టుకొస్తోంది.. ఈక్రిప్టో కాయిన్స్ ఒక్కసారిగా బూమ్ పెంచుకుంటున్నాయి. వేలను లక్షల రూపాయలుగా మార్చేస్తున్నాయి. అయితేే కొన్ని రోజులకే ఢాం అంటున్నాయి.. 

తాజాగా సోమవారం షిజు అనేకొత్త టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ రెండు గంటల్లోనే 6,00,000 శాతం ర్యాలీ అయినట్లు కాయిన్ మార్కెట్ క్యాప్ తెలిపింది. ఈ కాయిన్ 0.000000009105 నుంచి 0.00005477 వరకు పెరిగింది. ఎక్స్ ఛేంజుల్లో వాల్యూమ్ 65 శాతం పెరిగింది. షిజు టోకెన్ విపరీతంగా ర్యాలీ కావడంతో కేవలం రెండు గంటల్లోనే రూ.1000 నుంచి ఏకంగా రూ.60 లక్షలుగా అయ్యాయి. 

షిజు కాయిన్ అనేది క్రాస్ చైనా ఆధారిత మీమ్ టోకెన్.. మెటావర్స్ గేమింగ్, మల్టీ చైన్ వాలెట్, ఎన్ఎఫ్టీ మార్కెట్ వ్యవస్థల మిశ్రమంగా బయటకు వచ్చింది. అయితే ఈ కాయిన్ చలామణికి సంబంధించిన వివరాలు సరిగ్గా తెలియడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఈ టోకెన్ ఈ విధంగా ర్యాలీ అవ్వడానికి కారణాలు తెలియడం లేదు. 

Leave a Comment