గూగుల్ నుంచి కొత్త యాప్.. వేలల్లో సంపాదించండి..!

గూగుల్ నుంచి సరికొత్త యాప్ రాబోతుంది. ‘గూగుల్ టాస్క్ మేట్’ (google task mate app) పేరుతో వస్తున్న ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉంది. ఈ యాప్ ద్వారా కొన్ని పనులు పూర్తి చేయడం ద్వారా వేల రూపాయల్లో సంపాదించవచ్చు. ఈ టాస్క్ మేట్ ప్రస్తుతం  బీటా వెర్షన్ లో ఉంది. తర్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఈ దశలో కొందరు ఎంపిక చేసిన టెస్టర్లకు మాత్రమే రెఫరల్ కోడ్ వ్యవస్థ ద్వారా యాప్ లో ప్రవేశించడానికి అనుమతి వస్తుంది. ఇక కస్టమర్స్ వారు పూర్తి చేసిన పనులకు స్థానిక కరెన్సీలో డబ్బులు వస్తుంది. ఈ సర్వీస్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో వచ్చినట్లు ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. 

గూగుల్ టాస్క్ మేట్ ఎలా పనిచేస్తుంది అంటే? 

  • ఇందులో మీ దగ్గర్లోని టాస్క్ లను గుర్తించి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 
  • ఇందులోని పనులను సిట్టింగ్ లేదా ఫీల్డ్ టాస్క్ లుగా విభజించారు.
  •  సిట్టింగ్ అంటే ట్రాన్స్ స్కైబింగ్, ఇంగ్లీష్ నుంచి మీ భాషలోకి అనువదించడం.
  •  ఫీల్డ్ టాస్క్ అంటే మీ దగ్గర్లోని రెస్టారెంట్లు లేదా ఇతర ప్రదేశాల ఫొటో తీసి, దానికి సంబంధించి మీ ప్రాధాన్యతల గురించి అడిగే సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా సంపాదించవచ్చు.
  • దీని ద్వారా మ్యాపింగ్ మరింత బలోపేతం చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది..
  • మీరు సంపాదించిన డబ్బును ఇ-వాలెట్ కు రిజిస్టర్ చేసుకోవడం లేదా ఇన్ యాప్ పేమెంట్ పార్ట్ నర్ ద్వారా చెల్లిస్తుంది. 
  • ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి ఉన్నప్పటికీ, మీకు రెఫరెల్ కోడ్(google task mate referral code) ఉంటే తప్ప దానిని ఉపయోగించలేరు. 

  

Leave a Comment