కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం ఆరోగ్య సేతు యాప్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్లను మరింత కచ్చితంగా మరియు సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో ప్రజలకు సహాయపడే కొత్త యాప్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ ను రూపొందించింది. 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోని గూగుల్ ప్లేస్టోర్ లో మరియు ఐఫోన్ యొక్క యాప్ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘Aarogya setu’ ట్రాకింగ్ యాప్, స్మార్ట్ ఫోన్ యొక్క జీపీఎస్ సిస్టమ్ మరియు బ్లూటూత్ ను ఉపయోగించడం ద్వారా కరోనా వైరస్ సంక్రమణను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఈ వైరస్ మీ దగ్గరిలో ఉందో లేదో నిర్ణయించడంలో సహాయపడే సమాచారాన్ని అందిస్తుంది.

Aarogya setu యాప్ 11 భాషలను సపోర్ట్ చేస్తుంది. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత, మీరు మీ మొబైల్ నెంబర్ తో నమోదు చేసుకోవాలి. తరువాత, మీ ఆరోగ్య గణాంకాలు మరియు ఇతర ఆధారాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ట్రాకింగ్ ను ప్రారంభించడానికి మీ లొకేషన్ మరియు బ్లూటూత్ ను ఆన్ లో ఉంచాలి. 

మీరు యాప్ లోకి ప్రవేశించిన తర్వాత మీరు కరోనా వైరస్ పాజిటివ్ గా పరీక్షించబడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సందర్భంలో యాప్ మీ లొకేషన్ ను స్కాన్ చేస్తుంది. మరియు మీ డేటాను ప్రభుత్వంతో పంచుకుంటుంది. 

ఇది కాకుండా మీకు కోవిడ్ 19 యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్ణయించడానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్ బాట్ కూడా ఈ యాప్ లో ఉంది. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి వివిధ సౌకర్యాలు మరియు అప్ డేట్ గురించి మీకు తెలియజేస్తుంది. జాతీయంగా మరియు రాష్ట్రాల వారీగా కరోనా కేసుల గురించి తెలుస్తుంది. 

 

 

Leave a Comment