‘పరిస్థితి చేయిదాటింది..మేం నిస్సహాయులం’.. రోదిస్తున్న డాక్టర్..!

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది..ఈనేపథ్యంలో ముంబైకి చెందిన డాక్టర్ తృప్తి గిలాడా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ ‘ముంబైలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడి ఆస్పత్రుల్లోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు..

మేము నిస్సహాయులం..ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతో కొంత ఉండనే ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి.. ఎంతో మంది యువత కూడా మహమ్మారి బారిన పడి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోంది. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లను కళ్లారా చూస్తూ కూడా ఏమీ చేయలేని దుస్థితి. నిజానికి అస్వస్థతకు గురైనా, లేదంటే అలా నిపించినా బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. 

ఆస్పత్రుల్లో బెడ్ల కొతర తీవ్రంగా ఉంది. మీరు హోం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సలహాలు తీసుకోండి.. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అది మంచి పద్దతి కాదు. మీకోసం ఎంతో మంది ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.  

Leave a Comment