సామ్, చైతు విడాకులకు కారణమం అతడేనా..?

సమంత, నాగచైతన్య తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. గత కొద్ది రోజులుగా వీరి విడాకులపై ఎన్నో రూమర్స్ వస్తున్నా.. శనివారం ఇద్దరు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే వీరి విడాకులకు అసలు కారణమేంటో ఇప్పటికీ తెలియరాలేదు. వీరు విడిపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందని పలువురు ఆరాతీస్తున్నారు. అయితే వీరి విడాకులు రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్-2 చిత్రంలో సమంత బోల్డ్ సీన్లలో నటించడం అక్కినేని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారని, ఈ విషయంలో చైతు కూడా అసహనానికి గురయ్యారని వార్తులు వినిపిస్తున్నాయి. మరోవైపు నాగచైతన్యను ఓ బాలీవుడ్ స్టార్ ప్రభావితం చేశారని, అతని సలహా మేరకే సమంతతో విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా తెరపై కొత్తవివాదం పుట్టుకొచ్చింది. సమంత తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకోవడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీంతో సమంత వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సామ్, చైతుల విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణమని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా విడాకుల ప్రకటన రాగానే ప్రీతమ్ చేసిన పోస్టులు పలు అనుమానాలు రేకెత్తించాయి. సమంత, చైతు విడాకులకు ప్రీతమే కారణమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుననారు. ఇన్ స్టాగ్రామ్ లో వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతను జీజీ(అక్క) అని పితుస్తాడు. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.   

Leave a Comment