పవన్ కళ్యాణ్ ఫొటోపై నెటిజన్లు ట్రోలింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్ లో ఉన్నారు. కాగా, పవన్ కు కరోనా వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఆయన బెడ్ పై ఉన్న ఫొటోను షేర్ చేశారు. 

ప్రస్తుతం ఆ ఫొటోపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇక వివాదాలకు కేరాఫ్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్ బెడ్ పై ఉన్న ఫొటో పెట్టి కామెంట్ చేశారు. ‘ఈ ఫొటోలో ఫేక్ ఏమిటో నాకు తెలియజేయండి .. ఎవరు గెలిచినా నేను అతని ఫోటోను పెట్టి అతనికి రివార్డ్ థంబ్స్ అప్ ఇస్తాను’ అంటూ పోస్టు చేశారు..

అంతే.. ఆ ఫొటోపై నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ఆ ఫొటోలో ఉన్న మిర్రర్ లో కెమెరా మెన్ కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశారు. ఇంకా ఆయన బెడ్ పక్కన ఆక్సిజన్ సిలిండర్ కనిపించకపోవడంతో సెలైన్ బాటిల్ ముక్కులో ఎక్కిస్తున్నారా? అని,  కోవిడ్ పేషెంట్ కి సెలైన్ బాటిల్ ఎక్కిస్తారా?, ఇది కేవలం ఎన్నికల్ స్టంట్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.   

Leave a Comment