మోహన్ బాబు నా క్లాస్ మేట్.. ఘాటుగా స్పందించిన సిద్ధార్థ్..!

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్ధార్థ్.. అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం సముద్రం సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ వయస్సుపై ట్రోలింగ్ జరుగుతోంది. ‘20 ఏళ్ల హీరోయిన్లు 40 ఏళ్లు పైబడిన సిద్ధార్థ్ తో నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో, దిక్కుమాలిన లాజిక్’ అంటూ ఓ నెటిజిన్ సిద్ధార్థ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు:

ఈ కామెంట్ కి సిద్ధార్థ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్ రా దరిద్రమ్.. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. 

ఇక మరో నెటిజన్ కూడా సిద్ధూను కామెంట్ చేస్తూ.. ‘ నువ్వు ప్రకాశ్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సిద్ధూ ‘ఛా అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్ మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధూ ట్వీట్ చేశాడు. 

అసలు ఈ కాంట్రవర్సీ ఎలా మొదలైంది?

అసలు సిద్ధూ వయస్సును టార్గెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ ఎలా మొదలైందంటే.. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప నుంచి మొదలైంది. నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన ఒక పాత్రలో అమ్ము అభిరామి నటించింది. అయితే ఇటీవల వారికి సంబంధించిన పోస్టర్ ను చూసిన కొంత మంది ఆమె వయసు వెంకీ వయసులో మూడో వంతు కూడా ఉండదేమో అనే కామెంట్స్ చేశారు. అలా ఈ కాంట్రవర్సీలోకి సిద్ధూను కూడా లాగేశారు…

 

Leave a Comment