‘ఇండియన్ ఐడల్’ విజేతగా నెల్లూరు అమ్మాయి..!

‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ విజేతగా నెల్లూరు గాయని బీవీకే వాగ్దేవి నిలిచింది. దాదాపు 15 వారాల పాటు సాగిన ఈ షోకు సంగీత దర్శకుడు తమన్, నటి-గాయని నిత్యా మీనన్, గాయకుడు కార్తిక్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సోలో తమ టాలెంట్ నిరూపించుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రయత్నించగా.. వారిలో 12 మంది మాత్రమే ఎంపికయ్యారు. వారిలో 5 మంది మాత్రమే ఫైనల్స్ కి చేరారు.  

జూన్ 17న జరిగిన ఫినాలే ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఐదుగురు ఫైనలిస్టులు జయంత్(రామగుండం), వాగ్దేవి(నెల్లూరు), శ్రీనివాస్(కడప), వైష్ణవి(చెన్నై), ప్రణతీ(హైదరాబాద్)లు చిరంజీవి ముందు పర్ఫెర్మెన్స్ చేశారు. ఇందులో సింగర్స్ పాడిన పాటలను చీరు ఎంజాయ్ చేశారు. వాగ్దేవి పాటకు చిరంజీవి ఫిదా అయ్యారు. వాగ్దేవి పాడిన ‘‘ఆట కావాలా పాట కావాలా’’ అనే పాట విని మెగాస్టార్ మెస్మరైజ్ అయ్యారు.

తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే విజేతగా వాగ్దేవి నిలిచింది. ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆమె పేరును ప్రకటించారు. ‘‘త్వరలోనే నువ్వు పాడే పాట నేను హీరోయిన్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తుంది’’ అని చిరంజీవి వెల్లడించారు. నెల్లూరుకు చెందిన బీవీకే వాగ్దేవి చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలోని ‘‘లాహే లాహే..’’ పాట పాడే ఇండియన్ ఐడల్‌కు సెలక్ట్ కావడం గమనార్హం.

విజేతగా నిలిచిన వాగ్దేవికి రూ.10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది. స్పాన్సర్ నుంచి మరో రూ.6 లక్షలు వచ్చాయి. ఈ షోలో రన్నరప్ గా శ్రీనివాస్ నిలిచాడు. అలాగే, రెండో రన్నరప్ గా వైష్ణవి ఎంపికైంది. వీళ్లకు కూడా ఆహా సంస్థ నుంచి ప్రైజ్ మనీ లభించింది.  ఫినాలే ఎపిసోడ్‌లో ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్ కోసం హీరో రానా, నటి సాయి పల్లవి కూడా వచ్చారు. ఇండియన్ ఐడల్ తెలుగు సింగర్స్ పాటలను వారు కూడా ఎంజాయ్ చేశారు.

 

Leave a Comment