నెల్లూరు జిల్లాలో కుమార్తెలను బలి ఇవ్వబోయిన తండ్రి..!

క్షద్రపూజల మైకంలో ఓ వ్యక్తి తన బిడ్డలనే చంపుకోబోయాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ కి పూర్విక, పునర్విక అనే కవల పిల్లలు ఉన్నారు. వేణుకు శాంతి పూజలు, క్షద్ర పూజలు అంటే పిచ్చి.. 

ఆ పిచ్చి ఇటీవల ముదిరిపోయింది. దీంతో తన ఇద్దరు కవల కూమార్తెలను కూర్చోబెట్టి క్షద్రపూజలు చేశాడు. ముగ్గులో కూర్చోబెట్టి బలి ఇచ్చే ప్రయత్నం చేశాడు. భయంతో చిన్నారులిద్దరూ కేకలు వేశారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపే పునర్విక అనే బాలిక నోట్లో కుంకుమ కుక్కడం గమనించారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. మరో బాలిక పూర్వికను బంధువులు తమ ఇంటికి తీసుకుపోయారు. పునర్విక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు

Leave a Comment