రక్షించాల్సిన పోలీసే.. బాలికపై అత్యాచారయత్నం చేశాడు..!

రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడు బాధ్యత మరిచారు.. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల మేరకు.. జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ సమస్యపై తండ్రి కూతురు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈక్రమంలో తండ్రికి సమీపంలోని ఓ దుకాణానికి పంపించి.. బాలికపై అత్యాచారయత్నం చేశాడు. 

బాలిక భయంతో పరిగెత్తి తండ్రికి జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక, ఆమె తండ్రి చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైకేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్ ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణలో బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు తేలింది. దీంతో సుధాకర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. 

Leave a Comment