రెడ్ క్రాస్ నిర్లక్ష్యం.. 3 ఏళ్ల బాలుడికి హెచ్ఐవి రక్తం ఎక్కించారు..!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడికి హెచ్ఐవి నిర్ధారణ అయ్యింది. కొన్నేళ్ల నుంచి బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కిస్తారు.. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి నల్లకుంటలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకుంటున్నారు.. 

 

బాలుడి తండ్రి శివ మాట్లాడుతూ.. గతనెలలో రక్త మార్పి కోసం రెడ్ క్రాస్ కి వెళ్లిన సమయంలో ఆ బాలుడికి హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చారని తెలిపారు. దీంతో జులై 30న రెడ్ క్రాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తర్వాత తనతో పాటు తన భార్యకు కూడా టెస్టులు చేయిస్తే తమకు హెచ్ఐవి నెగిటివ్ వచ్చిందన్నారు.   

 

రెడ్ క్రాస్ సిబ్బంది మాత్రం మేము ఆరు నెలల నుంచి బ్లడ్ బ్యాంకుకు రాలేదని పోలీసులకు చెబుతున్నారని, తమ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చామని బాలుడి తండ్రి తెలిపాడు. రెడ్‌క్రాస్ బ్లడ్‌ బ్యాంకు నుంచి సేకరించిన రక్తంతోనే తమ కొడుకుకు హెచ్ఐవీ సోకిందని పేర్కొన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. 

 

 

హైదరాబాద్‌కు చెందిన మూడేళ్ల బాలుడికి హెచ్ఐవీ (HIV) నిర్ధారణ అయ్యింది. బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతుండడంతో వైద్యుల సూచనమేరకు 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. బాలుడికి హెచ్ఐవీ ఉందని తేలడంతో రెడ్‌క్రాస్ బ్లడ్‌ బ్యాంకు సిబ్బందిపై బాలుడి తల్లిదండ్రులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

 

 

Leave a Comment