తల్లికి నెగిటివ్..పుట్టిన బిడ్దకు పాజిటివ్..!

దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. తాజాగా ఢిల్లీలో అందరినీ ఆశ్చర్యపరిచే ఘటన జరిగింది. తాజాగా ఒక గర్భిణికి కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఇలా జరగడం దేశంలోనే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. 

ఢిల్లీలో ఓ గర్భిణికి కరోనా వైరస్ రావడంతో జూన్ 11న రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో చికిత్స కోసం చేరింది. జూన్ 25న ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఆమెకు మళ్లీ పాటిటివ్ అని వచ్చంది. మరిన్ని రోజులు చికిత్స అందించిన డాక్టర్లు జులై 7న మూడో సారి పరీక్షలు జరిపారు. అయితే ఈ సారి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. 

ఆ మహిళకు కరోనా నెగిటివ్ అని వచ్చిన మరుసటి రోజు అదే హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని గంటల తర్వాత వైద్యులు ఆ శిశువును పరీక్షించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా సోకే అవకాశం ఉందని, అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ చౌదరి తెలిపారు. 

Leave a Comment