ఐఐటీ చదివి బర్రెలు అమ్ముతున్నారు.. 2500 కోట్ల అమ్మకాలు చేశారు..!

ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు.. మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ వారికి ఏదైన సొంతంగా సాధించాలని కల.. చివరికి ఇద్దరూ ఉద్యోగాలు మానేసి ఆన్ లైన్ లో బర్రెలను అమ్ముతున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నారు. వారే  నీతూ యాదవ్.. కీర్తి జంగ్రా.. నీతూది జైపూర్ లోని నవల్ పూర్.. కీర్తిది హర్యానాలోని హిసార్ పట్టణం.. ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ రూమ్మేట్స్ కూడా.. ఐఐటీ అయ్యాక నీతూ బెంగళూరులో ఆన్ లైన్ కథల వేది ‘ప్రతిలిపి’లో ఉద్యోగం చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్గావ్ లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్ లో పనిచేయానికి వెళ్లింది. అయితే ఇద్దరికి వారి ఉద్యోగాలపై అసంతృప్తి ఉండేది. ఏదైనా సొంతంగా సాధించాలని ఉండేది. దూరంగా ఉన్నా ఇద్దరూ టచ్ లో ఉండేవారు.. 

ఈక్రమంలో ఇద్దరికీ ఓ ఐడియా వచ్చింది. ఆన్ లైన్ లో పశువులు అమ్మాలనే ఆలోచన కలిగింది. నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు కావడంతో ఆమెకు పశువుల గురించి చిన్నప్పటి నుంచే తెలుసు.. కీర్తి తండ్రి ఉపాధ్యాయుడు.. కానీ ఆమె మేనమాలు రైతు కావడంతో ఇద్దరికీ పశువుల సంత గురించి ఐడియా ఉంది. దీంతో వీరి ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నారు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి సొంత ఊర్లకు వచ్చేశారు.. వీరి ఐడియాను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం షాక్ అయ్యారు. ఇంత చదువు చదివి బర్రెలు అమ్మడం ఏంటీ? మీకేమైనా పిచ్చా అని చెప్పారు. చివరికి ఒప్పుకున్నారు.. 

అంతే 2019 చివరలో బెంగళూరులో రూ.11,000 అద్దెతో ఓ రూం తీసుకున్నారు. అక్కడి నుంచి నీతు, కీర్తిలు ‘యానిమల్’ యాప్ ద్వారా తమ కార్యకలాపాలు ప్రారంభించారు. పశువులను కొనాలనుకున్న రైతు, అమ్మాలని అనుకున్న రైతులు ‘యానిమల్’ ద్వారా లావీదేవీలు జరపుకోవచ్చు. అయితే 2019 చివరి నాటికి వీరు కేవలం 50 పశువులే ఆన్ లైన్ యాప్ ద్వారా అమ్మారు. కానీ 2020 లాక్ డౌన్ లో వీరి యాప్ ఓ ఊపు అందుకుంది. ఈ యాప్ ని వీరు హిందీలోనూ అభివృద్ధి చేశారు. దీంతో రాజస్తాన్ లో 5 లక్షల మంది పాడి రైతులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ లలో యానిమల్ కార్యకలాపాలు విస్తరించారు. ఇప్పటి వరకు 80 లక్షల మంది రైతులు ‘యానిమల్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారంటే చూసుకోండి.. వీరు ఎంతలా సక్సెస్ అయ్యారో.. ప్రస్తుతం నెలకు 50 వేల పశువుల అమ్మకం.. కొనుగోలు ఈ యాప్ ద్వారా జరుగుతోంది. 

అంతేకాదు ఇన్వెస్టర్లు కూడా వీరికి భారీగా ఫండ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయల ఫండ్స్ ఏజెన్సీల నుంచి వీరికి దక్కింది. వీరు చేసేది ఒక్కటే అమ్మే రైతును, కొనే రైతును లింక్ చేస్తారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు. అలాగే పాడి రైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇవ్వడం, పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో తెలియజేయడం చేస్తారు. ప్రస్తుతం ఉత్తర భారతదేవంలో యానిమల్ యాప్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది.. 

Leave a Comment