అమెరికాలో వేప పుల్ల 15 డాలర్లట..!

భారతదేశంలో వేపను ఔషధంగా ఉపయోగిస్తారు. దంతాల ఇన్ ఫెక్షన్ తగ్గించడంలో వేప చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియ్ లక్షణాలు ఉంటాయి. పంటి చిగుళ్ల నుంచి రక్షణ పొందవచ్చు. పూర్వం వేప పుల్లతో పళ్లు తోముకునే వారు. వేప బ్యాక్టీరియా, ఫంగస్ ను నివారిస్తుంది. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నారు. అయితే రకరకాలు టూత్ పేస్టులు, బ్రష్ లు రావడంతో అందరు వేప పుల్లతో పళ్లు తోముకోవడం మర్చిపోతున్నారు. 

కానీ మనదేశంలో విరివిగా లభించే వేప పుల్లకు అమెరికాలో బాగా డిమాండ్ ఉంది. అమెరికాలోని సూపర్ మార్కెట్ లో వేప పుల్లను ఆర్గానిక్ టూత్ బ్రష్ పేరుతో 15 డాలర్లకు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని సీయట్ కంపెనీ చైర్మన్ హర్ష గోయెంకా తన ట్విట్టర్ లో పోస్టులో వెల్లడించారు. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం టూత్ బ్రష్ ల మీద పడ్డామని, మనం వద్దనుకుంటున్న వాటినే ఇప్పుడు అమెరికా వాడుతోందని కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment