‘జీవితంలో తోడు కావాలి’..హాట్ టాపిక్ గా రేణు దేశాయ్ రెండో పెళ్లి..?

బద్రి సినిమా సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు రేణు దేశాయ్. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ సడన్ గా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ సింగిల్ గా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టాయి. 2018లోనే ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ తో ఆమె రెండో పెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 

‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’.. అంటూ రేణు దేశాయ్ ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. తర్వాత మరో పోస్టులో ‘మీ సోల్ మేట్ ని వెతకడానిక ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి’ అంటూ ఓ వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్టులు వైరల్ గా మారియి.   

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Leave a Comment