సమాజం సిగ్గుపడే ఘటన.. 16 నెలల పసికందుపై తండ్రి హత్యాచారం.. సహకరించిన తల్లి..!

సభ్యసమాజం సిగ్గుపడే ఘటన ఇది.. కన్న తండ్రే 16 నెలల పసికిందుపై అత్యాచారం చేశాడు.. తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి హత్యచేశాడు. ఈ ఘాతుకానికి ఆ పసికందు తల్లి కూడా సహకరించింది. అమ్మతనానికి మాయని మచ్చగా మిగిలింది. ఈ చిన్నారి మృతదేహాన్ని తీసుకొని గుజరాత్ లోని రాజ్ కోట్ కు రైలులో బయల్దేరారు. ట్రైన్ లో ప్రయాణికులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల మేరకు గుజరాత్ లోని రాజ్ కోట్ కి చెందిన దంపతులు సికింద్రాబాద్ లో ఉంటున్నారు. ఈనెల 3న కన్నకూతురిపై తండ్రి(26) అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘోరం తల్లి కళ్లెదుటే జరిగినా.. ఆమె కూడా అందుకు సహకరించింది. తర్వాత ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని తీసుకొని సొంతూరు రాజ్ కోట్ కి వెళ్లాలని ప్లాన్ వేశారు. సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రాజ్ కోట్ కి వెళ్లేందుకు రైలు ఎక్కారు. 

ఆ చిన్నారిలో ఎలాంటి చలనం లేదు. పైగా ఆ దంపతులు అనుమానస్పదంగా కనిపించారు. దీంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే ప్రయాణికులు టీటీఈకి సమాచారమిచ్చారు. టీటీఈ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహారాష్ట్రలోని షోలాపూర్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.    

Leave a Comment