జాతీయ ఆరోగ్య సర్వే : ఏపీలో ఒక్కో పురుషుడు నలుగురు స్త్రీలతో..!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆంధ్రప్రదేశ్ పురుషుల గురించి విచిత్రమైన ఫలితాలు వెలువడ్డాయి. ఏపీ పురుషులు తమ జీవితంలో కనీసం నలుగురితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన జాతీయ కుటుంబ సర్వేలో.. జీవితకాలంలో ఎంతమందితో సెక్స్ చేశారనే ప్రశ్నకు.. ఒక్కొక్కరు నలుగురితో లైంగిక సంబంధాలు ఉన్నట్లు ఏపీ పురుషులు తెలిపారట.. 

2020-21 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న ఏపీ అబ్బాయిలు.. తమకు ఒకరికంటే ఎక్కువ మందితో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాల పురుషులతో పోలిస్తే ఏపీ పురుషులే ఈ విషయంలో ముందున్నారట.. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నామని అంగీకరించారు.  

జీవితకాలంలో ఎంత మందితో సెక్స్ చేశారనే ప్రశ్నలకు.. ఆంధ్రప్రదేశ్ లో మహిళల సగటు 1.4గా ఉంది. పురుషుల సగటు 4.7గా ఉంది. ఈ విషయంలో తెలంగాణ పురుషులు ఏపీ తర్వాత స్థానంలో ఉన్నారట.. తెలంగాణ పురుషులు సగటున ముగ్గురితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఒప్పుకున్నారు. కర్ణాటక పురుషులు 2.7 మందితో, అండమాన్-నికోబార్ ఐలాండ్స్ లో 2.8, కేరళ, లక్షద్వీప్ పురుషులు ఒకరితో సంబంధాలు పెట్టుకున్నారు. పుదుచ్చేరి 1.2, తమిళనాడులో 1.8గా ఉంది. 

 

Leave a Comment