ఆకాశంలో దేవుడి చేయి.. ఫొటో విడుదల చేసిన నాసా..!

విశ్వం ఎప్పుడూ ఓ మెస్మరైజింగ్ సబ్జెక్ట్. విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అందుకే ఏదో అతీత శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుందని దాదాపు అన్ని మతాల వారు నమ్ముతారు. వీరి విశ్వాసాన్ని నిజం చేసేలా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ తాజాగా ఓ ఫొటో విడుదల చేసింది. ఈ ఫొటో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆకాశంలో ఓ చేయి కనిపిస్తుంది. ఈ ఫొటోను ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పేర్కొనడం గమనార్హం.. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాసా తరచూ విశ్వంలో కనిపించే అద్భుతమై చిత్రాలను విడుదల చేస్తుంటుంది. తాజాగా నాసా అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా తీసిన ఫొటోను విడుదల చేసింది. ఈ ఫొటోలో ఆకాశంలో ఒక బంగారు నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం ఒక చేతిలా కనిపిస్తుంది. చుట్టూ నక్షత్రాల్లో నుంచి పుట్టుకొస్తున్నట్లుగా ఈ చేయి ఆకారం ఉంది. నెటిజన్లు ఈ నిర్మాణాన్ని ‘అంతరిక్షంలో దేవుని చేయి’ అని పిలుస్తున్నారు. 

ఈ నిర్మాణం భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ బంగారు నిర్మాణం పల్సర్ ద్వారా విడుదలయ్యే శక్తి కణాలతో కూడి నిహారిక అని నాసా తెలిపింది. ఒక నక్షత్రం పేలిన తర్వాత పల్సర్లు మిగిలిపోతాయి. ఈ పల్సర్ ని PSB B1509-58 అంటారు. దీని వ్యాసం 19 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సెకనుకు 7 సార్లు తనంతట తానుగా తిరుగుతోంది. నుస్టార్ స్పేస్ ఎక్స్-రే టెలిస్కోప్ ఈ ఫోటోను తీసినట్లు నాసా తెలిపింది. ఈ ఫొటోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది దీనిని ‘దేవుని చేతి’తో పోల్చుతున్నారు. 

Leave a Comment