థియేటర్లలో రాబోయే తొలి సినిమా ఇదే..!

అన్ లాక్ 5.0లో భాగంగా ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాను థియేటర్లలో ఆడబోయే తొలిసినిమాగా ప్రదర్శించాలని బాలీవుడ్ నిర్ణయించింది.

ఉమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లోనే విడుదలైంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోడీ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో తొలి సినిమాగా రీ-రిలీజ్ చేయాలని బాలీవుడ్ నిర్ణయించింది. 

Leave a Comment