ఫ్యాన్స్ కు బాలయ్య సందేశం..!

నందమూరి బాలకృష్ణ ఈనెల 10న తన 61 పుట్టినరోజు జరుపుకోనున్నాడు. బాలయ్య పుట్టిన రోజు అంటేనే అభిమానులకు ఓ పండుగ.. ఆయన బర్త్ డేను వేడుకల నిర్వహిస్తారు. ఆయనకు విషెస్ తెలిపేందుకు ఇంటికి కూడా వస్తారు. దీనిని దృష్టి పెట్టుకుని బాలయ్య అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా, పుట్టినరోజు నాడు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని కోరారు. కరోనా సమయంలో అలాంటి పనులు చేయవద్దంటూ ట్విట్టర్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. 

‘ప్రతి ఏడాది తన కోసం అభిమానులు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఆ అభిమానానికి సర్వా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థతుల్లో మీరు రావడం అభిలషణీయం కావు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ.. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నా’ అంటూ తన అభిమానులకు సందేశమిచ్చారు బాలయ్య.. 

Leave a Comment