మహేష్ ఎంట్రీతో చైతు సినిమా వాయిదా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో చిరంజీవి సినిమాలో నిటించనున్నాడు. ఈ విషయంపై క్లారిటీ వస్తే ఈ సినిమా మహేష్ కెరియర్లో 27వ సినిమా అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత పరశురాంతో సినిమా ఉండనుంది. అయితే ఇటీవల వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని అనుకున్న అది కుదరలేదు. దీంతో పరశురామ్ తో మహేష్ సినిమా చేయనున్నాడు. ఇక అక్కినేని నాగ చైతన్య పరశురామ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య ఈ కాంబినేషన్ ను అధికారికంగా ప్రకటించారు. కాని మహేష్ ఎంట్రీతో అంత మారిపోయింది. 

ఈ గ్యాప్ లో నందిని రెడ్డితో సినిమా ఓకే చేసాడు చైతు. నందిని రెడ్డి సమంతతో కలిసి ఓ బేబీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే నందిని సమంతకు ఒక లైన్ వినిపించింది. ఈ సినిమాను చైతుతో చేయాలని చెప్పడంతో ఫుల్ స్టోరీని రెడీ చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా చేస్తున్న చైతన్య ఆ సినిమా తర్వాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించబోతున్నాడు. 

Leave a Comment