ప్రకాశ్ రాజ్ కు నాగబాబు కౌంటర్.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..

గ్రేటర్ ఎన్నికలు నటుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు పలికారు. దీంతో పవణ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేశారు. వపణ్ కళ్యాణ్ ను ఊసరవెల్లితో పోల్చారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై మెగాబ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడంటూ కౌంటర్ ఇచ్చాడు. 

రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతాయని, కానీ వాటి మార్పు వెనుక ఉండే ఉద్దేశ్యం ఆ పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు పవణ్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు.  

ప్రకాశ్ రాజ్ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లో అర్థమైందన్నారు. ఆయన ప్రశ్నలకు ప్రకాశ్ రాజ్ తడబడటం తనకు ఇంకా గుర్తుందన్నారు. నీకు బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదన్నారు. విమర్శించడం తప్ప మంచిని గుర్తించలేని సంస్కారం నీకు ఎలా నేర్పించగలుగుతామని వ్యాఖ్యాానించారు. 

దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరన్నారు. బీజేపీ నేతలపై ఎన్ని విమర్శలు చేసినా వారు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో అని తెలిపారు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్ని గుర్తున్నాయని చెప్పారు. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Leave a Comment