నా భర్త అమాయకుడు : శిల్పా శెట్టి

40
Shilpa Shetty

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టిని ముంబై పోలీసులు విచారించారు. విచారణలో శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాను వెనుకేసుకొచ్చారు. తన భర్త అమాయకుడని, తనకు ఈ చిత్రాల రాకెట్ తో సంబంధం లేదని శిల్పా శెట్టి తెలిపింది. 

పోర్నోగ్రఫీ చిత్రాలను తీయడంలో తన భర్త పాత్ర ఏదీ లేదని ఆమె వెల్లడించింది. పోర్నోగ్రపీకి, ఏరోటికాకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని చెప్పింది. ఎరోటికా కేవలం లైంగిక భావనలను రేకెత్తించడమని, పోర్నోగ్రఫీ అంటే అ

తన భర్త రాజ్ కుంద్రా కేవలం ఎరోటికా మూవీలే తీసేవాడని, లండన్ లో ఉంటున్న కుంద్రా బావ ప్రదీప్ బక్షి హాట్ షాట్ యాప్ తో ఈ విధమైన చిత్రాలు తీస్తుంటాడని శిల్పాశెట్టి వెల్లడించింది. కానీ కుంద్రా మాత్రం ఇలాంటి చిత్రాలు తీయడని పేర్కొంది. 

కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్ కుంద్రా కస్టడీని ఈనెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేరున రిజిస్ట్రర్ అయిన యస్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశఆరు. 

Previous articleTokyo Olympics: 20 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు పతకం..!
Next articleTokyo Olympics: పీవీ సింధూ శుభారంభం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here