వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలి : సీఎం జగన్

వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గడపగడపకూ కార్యక్రమం దాదాపు 8 నెలలపాటు జరుగుతుందని, ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయింపు ఉంటుందని అన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు. ఇది కష్టం కాదన్నారు. మనం చేయాల్సిందల్లా ప్రజల మద్దతును తీసుకోవడమే అన్నారు. కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని?. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామని? ఎవరైనా అనుకున్నామా?  అలాగే 175కి 175 సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. 

‘రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి. ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. ప్రతి సచివాలయంలోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ గడపగడకూ నిర్వహించాలి. ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం’ అని సీఎం జగన్‌ అన్నారు.

 

Leave a Comment