దారుణం : తనను పెళ్లి చేసుకోలేదని యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు..

బీహార్ లోని వైశాలి జిల్లాలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోనని చెప్పిందుకు ఓ ముస్లిం యువతిని కిరోసిన్ పోసి నిప్పంటించారు.  చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై శవంతో నిరసన తెలిపారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. 

 వివరాలు మేరకు వైశాలి జిల్లాకు చెందిన గుల్నాజ్ ఖాతూన్ అనే యువతిని సతీష్ రాయ్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. మూడు నెలలుగా ఆ యువతిని వేధిస్తుండటంతో ఆ యువతి దానికి అభ్యంతరం తెలిపింది. తాను ముస్లిం అని, తనకు నిశ్చితార్థం కూడా అయిందని, వేధించవద్దని ఎంత చెప్పినా వినలేదు.

ఎంత చెప్పినా వినకపోవడంతో అక్టోబర్ 30న సాయంత్రం సమయంలో చెత్త పారబోసేందుకు వెళ్లిన ఆ యువతిపై సతీష్ కుమార్ రాయ్ మరియు చందన్ కుమార్ రాయ్ అనే ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. 75 శాతం కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ నవంబర్ 15న మరణించింది. 

అయితే ఈ ఘటన జరిగి 15 రోజులు అయినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. దీంతో యువతి మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు రోడ్డుపై నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా గుల్నాజ్ ది పేద కుటుంబం. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో తల్లి టైలరింగ్ చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటుంది. గుల్నాజ్ కు పెళ్లి కూడా నిశ్చయించింది. నాలుగు నెలల్లో పెళ్లి కూడా ఉంది. ఇంతలోనే దారుణం జరిగింది. దుర్మార్గుల చేతిలో ఆమె బలి కావడంలో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.  

Leave a Comment