వధువుతో తాళి కట్టించుకున్న వరుడు..!

సాధారణంగా హిందూ పెళ్లిలో వధువు మెడలో వరుడు మాత్రమే తాళి కట్టి మూడు ముళ్లు వేస్తాడు.. కానీ ముంబైకి చెందిన ఓ యువకుడు వధువుతో మూడు ముళ్లు వేయించుకున్నాడు. తన మెడలో తాళి కట్టించుకున్నాడు. పెళ్లి అనేది స్త్రీ, పురుషుల సమానత్వానికి ప్రతీక అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాదు, ఈ తాళిని ఇకపై ఎప్పుడూ తన మెడలోనే ఉంచుకంటానని తెలిపాడు. 

ముంబైకి చెందిన శార్ధూల్ కదమ్, తనుజ పాటిల్ అనే జంట నాలుగేళ్ల డేటింగ్ తర్వాత గతేడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే శార్ధూల్ మాత్రం వివాహం అంటే సమానత్వానికి ప్రతీక అని నమ్మేవాడు. దీనికి గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్య చేత తాళి కట్టించుకోవాలని అనుకున్నాడు. 

ఈ విషయంలో ఎలాగోలా తన కుటుంబ సభ్యులను ఒప్పించాడు. పెళ్లి రోజు తనుజ మెడలో తాళి కట్టిన వెంటనే.. తన మెడలో కూడా ఆమెతో మంగళసూత్రం తొడిగించుకున్నాడు. దీంతో ఈ పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఈ పెళ్లి వార్త కథనాలు వెలువడ్డాయి. ఇక సోషల్ మీడియాలో కూడా శార్ధూల్ పై విమర్శలు వచ్చాయి. ‘ఇదొక్కటే ఎందుకు శారీ కూడా కట్టుకో’ అంటూ కొందరు కామెంట్లు చేశారని, ఇంకా కొన్ని మాటల్లో చెప్పలేని కామెంట్స్ కూడా చేశారని శార్దూల్ చెప్పుకొచ్చాడు. 

వివాహమై నాలుగు నెలలు గడిచిన తాను ఇప్పటికీ తాళి బొట్టును తన మెడలోనే ఉంచుకున్నట్లు తెలిపాడు. ఇక కూడా తీయబోనని శార్దూల్ స్పష్టం చేశాడు. తాజాగా ఫేస్ బుక్ వేదికగా తన పెళ్లి గురించి శార్దూల్ మరోసారి వివరణ ఇచ్చాడు. దీంతో కొందరు నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొందరు విమర్శిస్తున్నారు. 

“Tanuja and I were in the same college but hardly interacted with each other. 4 years after we graduated, we reconnected…

Posted by Humans of Bombay on Wednesday, 5 May 2021

Leave a Comment