ప్రత్యేక అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన ధోనీ..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని కలిసేందుకు బారికేడ్లు దాటి మైదానంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ధోనీ స్వయంగా ఓ అభిమానిని కలిశాడు. రాంచీ ఎయిర్ పోర్ట్ లో తన అభిమానిని కలిసి ఆమెను సంతోష పరిచాడు. 

లావణ్య పిలానియా పుట్టుకతోనే దివ్యాంగురాలు.. ఆమెకు ధోనీ అంటే ఎంతో ఇష్టం.. అంగవైకల్యం ఉన్నా ధోనీ బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని ఎప్పటి నుంచి చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ధోనీ మిలటరీ క్యాంప్స్ కోసం రాంచీ వచ్చి ఎయిర్ పోర్టులో లావణ్యను కలిశాడు.  ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను ధోనీకి చూపించింది. 

ధోనీని చూసిన లావణ్య భావోద్వేగానికి గురైంది. దీంతో లావణ్య చేతులను దగ్గరికి తీసుకుని.. కన్నీళ్లను తుడిచాడు ధోనీ..తన బొమ్మ గీసినందుకు అభినందించాడు. ఈ విషయాన్ని లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అంతేకాదు ధోనీతో పోటోలను పోస్ట్‌ చేసింది. 

తాను ధోనీని కలిసానని, చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. మహీ తన చేతులు తడుముతూ ఏడ్వకూడదని చెప్పారని తెలిపింది. జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్పారని, తన బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారని లావణ్య చెప్పింది.. ధోనీ తన కోసం విలువైన సమయాన్ని కేటాయించారని, ధోనీ తనను సంతోషంగా ఉన్నావా? అని అడిగినప్పుడు తన దగ్గర రియాక్షన్ లేదని, ఆయన మాటలు విలువ కట్టలేనివని లావణ్య పేర్కొంది. 

 

Leave a Comment