సినిమా ప్రియులకు శుభవార్త.. మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.75కే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో రూ.250 నుంచి రూ.400 వరకు టికెట్ రేటు ఉంటుంది. కానీ ఆ ఒక్కరోజు మాత్రం అన్ని మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలకే అన్ని సినిమాలు చూడవచ్చు..
అన్ని ప్రధాన నగరాల్లోని PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటుకు టికట్లె లభించనున్నాయి. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారికి మాత్రం అదనపు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. నేషనల్ మూవీ డే రోజున కేవలం 75 రూపాయలకే భారీ బడ్జెట్ సినిమాలను చూసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వెంటనే అందరితో షేర్ చేసుకోండి.. మీ కుటుంబ సభ్యులతో కలిసి మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమా చూసేయండి..