వీడియో వైరల్: ధైర్యం చేసి పాము నుంచి కొడుకును కాపాడిన తల్లి..!

కర్ణటకలోని మాండ్యా జిల్లలో భయానక వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ పెద్ద పాము నుంచి ఒక తల్లి తన బిడ్డను కాపాడుకుంది..దీంతో రెప్పపాటులో ఆ బిడ్డకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తల్లీ బిడ్డలు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఇంటి బయట మెట్ల కింద నుంచి ఓ పెద్ద నాగుపాము వెళ్లోంది. ఆ పామును గమనించకుండా ఆ పిల్లోడు కింద కాలు పెట్టబోయాడు.. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి చూసేసరికి, నాగుపాము తన పడగ విప్పింది. ఇది గమనించిన తల్లి ఎంతో సమయస్ఫూర్తితో తన కొడుకును పక్కకు లాగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..  

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)

Leave a Comment