నాకు కాబోయేవాడు నా షూతో సమానం..అంచనాలు పెంచుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’..!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా టీజర్ ను విజయదశమి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హిరోయిన్ గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.

సరికొత్త డైలాగులతో ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.నిజానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా షూగింగ్ ఇటీవల మొదలైంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, వాసూవర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. 

Leave a Comment