ఏపీలో మరిన్ని సడలింపులు

ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరి కొన్నింటిపై సడలింపు ఇచ్చింది. ఇప్పటికే రవాణా వ్యవస్థ పునరుద్ధరణ, నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరిచేందుకు అనుమతులిచ్చింది. అయితే తాజాగా ఆభరనాల దుకాణాలు, బట్టలు, చెప్పుల షాపులు తెరిచేందుకు ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. 

అయితే పెద్ద షోరూంలలో షాపింగ్ చేయడానికి ఆన్ లైన్ లో ముందస్తు బుకింగ్ తప్పనిసరి. దుకాణాల్లో ట్రయల్ రూములకు అనుమతి నిరాకరించింది. 

తాజా సడలింపులు ఇవే..

  • నగలు, బట్టలు, చెప్పుల షాపులకు అనుమతి
  • బంగారం దుకాణాల్లో డిస్పోజబుల్ చేతి తొడగులు ఉండాలి. 
  • చెప్పుల దుకాణాలు, ఫ్రాంచైజీలను ఎప్పటికప్పుడు క్రమిరహితం చేయాలి. 
  • స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతి. అయితే వారు మాస్కులు, చేతి తొడగులు ధరించాలి. 
  • పెద్ద షోరూమ్ లకు వెళ్లాలంటే ఆన్ లైన్లో అనుమతి తప్పనిసరి
  • అన్ని షాపుల్లో ట్రయల్ రూములకు అనుమతి నిరాకరణ.
  • పానీపూరి బండ్లకు అనుమతి నిరాకరించిన ఏపీ సర్కార్.

 

Leave a Comment