ఏవండోయ్ ఇది చూశారా.. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న కోతి..!

కోతి చాలా తెలివైన జంతువులు.. చాలా అల్లరి చేస్తుంటాయి. జనం చేతిలో ఉన్న తినే పదార్థాలను సైతం తెలివిగా పట్టుకుపోగలవు.. అప్పుడప్పుడు కోతులు ప్రమాదాల బారిన పడుతుంటాయి. దీంతో వాటికి తీవ్ర గాయాలవుతుంటాయి.. గాయం అయినప్పుడు అవి చికిత్స చేసుకోలేవు కదా.. ఒకవేళ వాటికి యజమానులు ఉంటే చికిత్స చేయిస్తారు.. అంతేకాని.. స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి కోతులు చికిత్స చేయించుకోరు.. 

అయితే ఇక్కడ ఓ కోతి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత అది తన పిల్లతో సహా ఆస్పత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ విచిత్ర ఘటన బిహార్ లోని రోహ్ తాస్ జిల్లా షాజుమా ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే డాక్టర్ ఎస్ఎం అహ్మద్ క్లినిక్ కి ఓ కోతి గాయాలతో చికిత్స కోసం తన పిల్లతో పాటు వచ్చింది. ఈ రెండు కోతులకు అహ్మద్ చికిత్స అందించారు. కోతి చికిత్స తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఓ కోతి గాయాలతో క్లినిక్ వచ్చినట్లు డాక్టర్ అహ్మద్ గమనించాడు. కోతి గాయపడినట్లు అర్థం చేసుకుని.. దానిని లోపలికి తీసుకెళ్లాడు. కోతిని బెంచ్ పై కూర్చోబెట్టి గాయాలను పరిశీలించాడు. తల్లి కోతికి తలపై, పిల్ల కోతి కాలికి గాయాలయ్యాయి. డాక్టర్ రెండు కోతులకు ఇంజెక్షన్ ఇచ్చి.. గాయాలపై లేపనం కూడా వేశారు. రెండు కోతులు చికిత్స అందించిన తర్వాత ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.   

 

  

Leave a Comment