రెండు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి.. నీళ్ల ట్యాంక్ లో పడేసిన కోతులు..!

ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ లో దారుణం జరిగింది. కోతులు రెండు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేశాయి. దీంతో ఆ పసికందు మృతి చెందింది. వివరాల మేరకు బాగ్ పత్ కి చెందిన కేశవ్ కుమార్ దంపతులకు రెండు నెలల క్రితం ఓ పాప పుట్టింది. డాబాపై ఉన్న గదిలో నానమ్మతో పాప నిద్రపోయింది. ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. 

ఆ గది తలుపు తెరిచి ఉండడంతో కోతులు గదిలోకి ప్రవేశించాయి. కోతులు గదిలోని వస్తువులను కాకుండా నిద్రిస్తున్న రెండు నెలల చిన్నారిని బయటకు తీసుకొచ్చాయి. కేశవ్ కుమార్ తల్లి నిద్ర లేచేసరికి పాప కనిపించలేదు. దీంతో ఆమె కేకలు వేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పాప కోసం వెతకడం ప్రారంభించారు. 

చివరికి పాప నీళ్ల ట్యాంకులో తేలుతూ కనిపించింది. అప్పటి ఆ చిన్నారి చనిపోయింది. దీంతో కేశవ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గతంలో కూడా కోతులు తమ బిడ్డను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయని, అప్రమత్తమవడంతో వదిలేశాయని పాప తల్లిదండ్రులు తెలిపారు. 

Leave a Comment