ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఆన్ లైన్ లో డబ్బులు పంపటం సాధారణమైంది. అయితే పొరపాటున వేరే బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయితే.. వాటిని ఎలా తిరిగి పొందాలో తెలియదు. ఒక్కసారి డబ్బులు వేరే అకౌంట్లో ట్రాన్స్ ఫర్ అయితే అది పెద్ద సమస్యే.. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా డబ్బును తిరిగి తీసుకోలేము. అలా ట్రాన్స్ ఫర్ అయిన డబ్బులను తిరిగి పొందగలమా? అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పొరపాటున డబ్బు వేరే అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ అయితే ఏం చేయాలి?
- పొరపాటున వేరే అకౌంట్ కి డబ్బులు పంపితే వెంటనే సంబంధిత బ్యాంక్ కి ఈ విషయం గురించి చెప్పాలి. డబ్బులు ఎలా పంపించారో వివరించాలి. కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి మొత్తం డిటైల్స్ చెప్పాలి. ట్రాన్సాక్షన్ కి సంబంధించిన వివరాలను బ్యాంక్ కి ఇవ్వాలి.
- బ్యాంక్ మధ్యవర్తిగా వ్యవహరించి ఏ అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ ఫర్ అయితే ఆ బ్యాంక్ తో సంప్రదింపులు చేస్తుంది. బ్యాంక్ సాయంతో తమ నగదును తిరగి పంపాలని వారిని మీరు కోరవచ్చు.
- సేమ్ బ్యాంక్ లో డబ్బులు పొందిన వ్యక్తి అకౌంట్ ఉంటే.. బ్రాంచ్ మేనేజర్ కి ఈ విషయం గురించి చెబితే సరిపోతుంది. డబ్బులు పొందిన వ్యక్తి అంగీకరిస్తే కొన్ని రోజుల్లోనే మీ డబ్బులు రిఫండ్ అవుతాయి.
- డబ్బులు పొందిన వ్యక్తి.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించకపోతే.. లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో బ్యాంకులకు సంబంధం ఉండదు. ఈ సమస్యను కోర్టులో పరిష్కరించుకోవాలి. అందుకు చాలా సమయం పడుతుంది.
పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు:
- డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే ముందు అవతలి వ్యక్తి బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
- ఇక పెద్ద మొత్తంలో డబ్బులు పంపే ముందు చిన్న మొత్తంలో డబ్బులు పంపి చెక్ చేసుకోవాలి. అవి సరైన వ్యక్తికి చేరాయా లేదా అని తెలుసుకోవాలి.
- మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఫోన్ నంబర్ మన దగ్గర ఉంచుకోవాలి. ఒకవేశ పొరపాటు జరిగితే వెంటనే బ్యాంక్ కి తెలియజేయాలి. అప్పుడు రీఫండ్ త్వరగా పొందగలితే అవకాశం ఉంటుంది.