సోషల్ మీడియా మొదటి స్థానంలో మోడీ, రెండో స్థానంలో జగన్..

సోషల్ మీడియాలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మొదటిస్థానంలో భారత ప్రధాని నరేంద్ర నిలవగా, రెండో స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ ను ‘చెక్ బ్రాండ్స్’ సంస్థ వెల్లడించింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో అత్యధిక ట్రెండ్స్ మోడీ, జగన్ పేర్లపైనే ఉన్నాయి. చెక్ బ్రాండ్స్ సంస్థ ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీల వ్యక్తుల ట్రెండ్స్ ను విశ్లేషించింది. 

దాదాపు 10 కోట్ల ఆన్ లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా తొలి నివేదికను వెల్లడించింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ పీడియా, యూట్యూబ్ లలో అత్యధిక ట్రెండ్స్ మోడీ, జగన్ పైనే ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రధాని మోడీకి  2171 ట్రెండ్స్ ఉండగా, జగన్ కు 2137 ట్రెండ్స్ ఉన్నాయని పేర్కొంది. ఇక తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. 

బ్రాండ్ స్కోర్ విషయంలోనూ 70 స్కోర్ తో మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికల్లో ఫాలోవర్లు, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్ మెంట్ వంటి వాటి ఆధారంగా బ్రాండ్ స్కోర్ నిర్ణయిస్తారు. ఇందులో రెండో స్థానాన్ని 36.43 స్కోర్ తో అమిత్ షా దక్కించుకున్నారు. ఇక బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా మోడీనే తొలి స్థానంలో ఉన్నారు. 336 కోట్ల బ్రాండ్ వాల్యూతో తొలి స్థానంలో మోడీ నిలవగా, 335 కోట్ల బ్రాండ్ వాల్యూతో అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు. 

Leave a Comment