చెట్టుపై మోడీ చిత్రం చెక్కాడు..!

ఒక్కక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. కళాకారులు తమ కళలను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. ఒడిశా రాష్ట్రం మయూరభంజ్ లోని సిమిలిపాల్ నేషనల్ పార్క్ లో ఓ కళాకారుడు చెట్టుపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని చెక్కి తన కళను చూపించాడు. అడవిలో అక్రమంగా చెట్లను నరికివేడాన్ని గమనించాలని ఆయనను అభ్యర్థించాడు. 

సమరేంద్ర బెహెరా అనే కళాకారడుు అడవిలోని చెట్లపై వివిధ చిత్రాలను చెక్కాడు. పర్యావరణాన్ని సురక్షితంగా మరియు శుభ్రంగా ఉంచడానికి అతడు తన చిత్రాల ద్వారా సమాజానికి సందేశాన్ని అందిచడానికి ప్రయత్నిస్తుంటాడు. అతడు ‘ఆర్టిస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్’ గా ఒడిశాలో ప్రసిద్ధి చెందాడు.  “ఈ చిత్రం ద్వారా, ఈ అడవిలో అక్రమంగా చెట్లను నరికివేయడాన్ని గమనించాలని తాను మోడీజికి ఒక అభ్యర్థన పంపాలనుకుంటున్నానని బెహెరా చెప్పారు.

Leave a Comment