చైనా, పాకిస్తాన్ లతో యుద్ధానికి మోడీ తేదీ కూడా నిర్ణయించారు : స్వాత్రా దేవ్ సింగ్

పాకిస్థాన్, చైనా దేశాలతో ఎప్పుడు యుద్ధం చేయాలో ప్రధాని మోడీ నిర్ణయించారని బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వాత్రా దేవ్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధానికి ప్రధాని మోడీ రెడిగా ఉన్నారని ఏకంగా అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగిపోతున్నాయని, చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదని ఆయన పేర్కొన్నారు. 

రామ్ మందిర్ మరియు ఆర్టికల్ 370పై తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే, పాకిస్థాన్ మరియు చైనాతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ప్రధాని మోడీ నిర్ణయించారని సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఆయన చెప్పారు. యుద్ధానికి తేదీ కూడా నిర్ణయించారని వెల్లడించారు. ఇంకా ఆయన సమాజ్ వాదీ పార్టీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను ఉగ్రవాదులతో పోల్చారు.  

Leave a Comment