ప్రపంచంలోనే అతి పెద్ద బుగ్గలతో మాడల్.. సర్జరీతో ఈ పరిస్థితి..

కొంత మంది సెలబ్రిటీలు తమ అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అందుకోసం కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటారు. తమ రూపాన్ని మార్చేసుకుంటారు. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన 32 ఏళ్ల అనస్టాసియా పోక్రెష్ చుక్ అనే మోడల్ కు గ్లామర్ గా కనిపించడమంటే చాలా ఇష్టం..అందుకోసం ఆమె గత ఆరేళ్లలో అనేక సార్లు సర్జరీలు చేయించుకున్నారు. అందుకోసం ఆమె రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేశారు.

 సర్జరీ తర్వాత ఆమె బుగ్గలు, పెదాలు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. దీంతో ఇంత పెద్ద, అందమైన బుగ్గలు ప్రపంచంలో ఎవరికీ లేవని సంబరపడిపోతున్నారు. తన బుగ్గలతో తాను ప్రేమలో పడ్డానని చెబుతున్నారు. సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత అని రెండు ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సర్జరీ కంటే ముందే మీరు అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Leave a Comment