జీన్స్ ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్.. మీరు జాగ్రత్త..!

ఇటీవల సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు రకరకాల మోడళ్లను రూపొందిస్తున్నాయి. అయితే వాటి భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుహిత్ శర్మ అనే వ్యక్తి తన జీన్స్ ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ పేలిందని ట్విట్టర్ లో తెలిపాడు.

 దీంతో అతనికి గాయాలయ్యాయని చెప్పాడు. పేలిన సెల్ ఫోన్, జీన్స్ ప్యాంట్, కాలిన గాయాల ఫొటోలను అతడు ట్విట్టర్ లో పోస్టు చేశాడు.. పేలింది కూడా ప్రముఖ చైనా కంపెనీకి చెందిన వన్ ప్లస్ ఫోన్ అని తెలిపాడు. వన్ ప్లస్ నుంచి ఇది ఊహించలేదని, తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని, ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయాలని పేర్కొన్నాడు. 

ఈ విషయంపై కంపెనీ కూడా స్పందించింది. ఈ విషయం పరిశీలించి న్యాయం చేస్తామని పేర్కొంది. కాగా వన్ ప్లస్ మొబైల్ అకస్మాత్తుగా పేలడం ఇది మూడో సారి.. మొదటగా ఆగస్టులో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఫోన్ బయటకు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలిపోయింది. రెండోది సెప్టెంబర్ లో ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది జేబులో వన్ ప్లస్ అకస్మాత్తుగా పేలి గాయాలయ్యాయి. ఇది మూడో ఘటన.. అయితే మొబైల్ ఫోన్ ఇలా పేలిపోవడానికి గల కారణాలను కంపెనీ వివరణ ఇవ్వలేదు. 

Leave a Comment