‘దమ్ముంటే.. జగనన్న పథకాలు రద్దు చేసి ఎన్నికలకు రండి’

చంద్రబాబుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్

రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ సరికొత్త ప్రభంజనం సృష్టిస్తారని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో శ్రీశైలం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయబోతున్నాయని అన్నారు. 

దమ్ముంటే.. జగనన్న పథకాలు రద్దు చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. ఈర్నపాడు, మసీదుపురం, అబ్దుల్లాపురంలలో తిరునాళ్లలా జన స్పందన వచ్చిందన్నారు. జగనన్న ఏం చేశాడో మీ ఇళ్లలో అడిగి తెలుసుకోవాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే శిల్పా చెప్పారు.. జగనన్న బాగుంటే తామంతా బాగుంటామని, జగనన్నను మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నానని, ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. బుడ్డా వాళ్లు ఒరిజినల్ కాదని, డుప్లికేట్ లు అని, వారు కూడా ఉయ్యాలవాడ నుంచి వలస వచ్చారని అన్నారు. చెట్టు పేరు చెప్పి ఎన్నాళ్లు కాయలు అమ్ముకుంటావ్? అని బుడ్డా రాజాను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులుగా సీఎం జగన్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  

 

Leave a Comment