“నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లే జనసేనలో.. అలాంటి వారిని జైల్లో పెట్టాలి”

నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుకుంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గురువారం గుడివాడ మండలంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. 

అంబేద్కర్ ని వ్యతిరేకించే వారిని దేశం నుంచి బహిష్కరించాలని, అలాంటి వాళ్లను జైళ్లలో పెట్టాలని కొడాలి నాని అన్నారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ.. రాజ్యంగంపై కనీస అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఆయన విమర్శించారు. 

జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లను కొడాలి నాని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముక్యమని, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు కాదని అన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని, అది కూడా తెలియకుండా పవన్ మాట్లాడుతున్నాడని విమర్శించారు.  

Leave a Comment