క్రికెట్ కి వోడ్కోలు పలికిన మిథాలీ రాజ్..!

భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. సోషల్‌ మీడియా వేదికగా బుధవారం రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేసింది. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. 

1999లో మిథాలీ రాజ్ ఇంటర్నెషనల్ క్రికెట్ లో అడుగుపెట్టింది. 2005లో భారత మహిళా జట్టుకు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టింది. 232 వన్డేలు ఆడిన మిథాలీ 7805 పరుగులు సాధించింది. భారత్ తరఫున 12 టెస్టులు, 89 టీ20 మ్యాచ్ లు ఆడింది. 2019లో టీ20 క్రికెట్ కి వీడ్కోలు పలికిన మిథాలీ.. ఇప్పుడు అన్నీ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది.   

ప్రతి ప్రయాణం ఏదో ఒక రోజు ముగుస్తుందని మిథాలీ రాజ్ పేర్కొన్నారు. తన 23 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం గడించానని తెలిపారు. ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని, ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రెకెటర్లు రావాలని మిథాలీ రాజ్ భావోద్వేగ లేఖ విడుదల చేశారు.  

 

Leave a Comment