Tokyo Olympics: 20 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు పతకం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. స్నాచ్ లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ లో 115 కేజీలు బరువు ఎత్తింది. మొత్తం 202 కేజీలు ఎత్తిన మీరాబాయి స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్ లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్ జిజోయ్ బంగారు పతకం దక్కించుకుంది. 

భారత్ కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ సా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఇతర ప్రముఖులు ప్రశంసించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియాకు పతకం సాధించిపెట్టిన అథ్లెట్ గా మీరాబాయి నిలిచింది. 

Leave a Comment