చిన్న వయస్సులో పెళ్లి వద్దన్నందుకు.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య..!

తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ మోజులో పడ్డారు. చిన్న వయస్సులో ప్రేమ, పెళ్లి ఎందుకని తల్లిదండ్రులు మందలించడంతో ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని మిడ్జిల్ మండల పరిధిలోని వేముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇంటర్ చదివాడు. 

అదే గ్రామానికి చెందిన అఖిల తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలిసింది. దీంతో ఈ వయస్సులో ప్రేమ, పెళ్లి ఏంటి అని మందలించారు. దీంతో ఇద్దరు కలిసి ఊరి బయట ఓ మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment